ఓటీటీలోకి బన్నీ ఎప్పుడంటే ?

కరోనా లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకొనేందుకు బడా నిర్మాతలు, బడా బ్యానర్లు రెడీ అవుతున్నాయ్. సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరో-హీరోయిన్లు, నటీనటులు ఓటీటీలోకి వచ్చేందుకు, స్పెషల్ షోస్ చేసేందుకు ఓకే చెబుతున్నారు. ఇక అల్లు ఫ్యామిలీ ఇప్పటికే ఆహా పేరిట ఓటీటీ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారమే ఆహా ని అధికారికంగా లాంచ్ చేశారు. 

ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోస్ట్ గా చేసిన నవదీప్ బన్నీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు ? అని ప్రశ్నించారు. అయితే దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేను. అది సప్రైజ్ గా ఉంటుందని చెప్పారు. అయితే ఆహా కోసం మాత్రం బన్నీ ఓ బోల్డ్ యాడ్ చేశారు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.