#20YearsOfNTR కామన్‌ డీపీ.. అదిరిపోయింది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఈ ఏడాదితో 20సంవత్సరాలవుతున్న నేపథ్యంలో 20YearsOfNTR, 20YearsOfNTREra అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఓ కామన్‌ డీపీని విడుదల చేశారు. కాయిన్‌ ఆకారంలో ఉన్న ఈ ఫొటోలో.. ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ పోషించిన అన్ని పాత్రలను పొందుపరిచారు.

అంతేకాకుండా మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ సినిమాల్లో కీలకంగా ఉన్న కొన్ని ఆయుధాలను, ఆసక్తికర గుర్తులను కామన్‌ డీపీలో వరుసగా చూడొచ్చు. జి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి క్రియేట్‌ చేసిన ఈ పిక్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘నిన్ను చూడాలని’ చిత్రంతో కథానాయకుడిగా ఎన్టీఆర్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే ఏడాదిలో విడుదలైన ‘స్టూడెంట్ నెం.1’ ఆయనకు ఘన విజయాన్ని అందించింది. ఆ తర్వాత తారక్‌ ఎన్నో కుటుంబ కథా, కమర్షియల్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.