చైనా వస్తువులని నమ్మలేం మరీ.. చైనా టీకాని నమ్మొచ్చా !
చైనా వస్తువులు అగ్గువకు దొరుకుతాయ్. కానీ క్వాలిటీ ఉండవు. ఈ నేపథ్యంలో చైనా తీసుకొచ్చిన కరోనా టీకాని ఏ మేరకు నమొచ్చనే చర్చ సాగుతోంది. చైనాలో అభివృద్ధి చేస్తున్న ‘కరోనా వాక్’ వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తుందని, జరిపిన ప్రాథమిక ప్రయోగాల్లో వైరస్ను ఎదుర్కొనే సమర్థమైన యాంటీబాడీల్ని ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు తేలింది. ఈ మేరకు ‘లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
ఏప్రిల్ 16 నుంచి మే 5వ తేదీ మధ్య మొత్తం 700 మంది వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుగల వారికి మాత్రమే వ్యాక్సిన్ను ఇచ్చారు. 14 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇచ్చి పరీక్షించారు. కనిష్ఠ డోసు తీవ్రతతో కూడా మెరుగైన రోగనిరోధకత ఏర్పడిందని అధ్యయనంలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతంలో నొప్పి మినహా ఇతరత్రా దుష్ప్రభావాలేమీ కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో చైనా టీకా ఫలిస్తోంది. ఈ టీకాని ‘అత్యవసర అనుమతి’ ద్వారా వినియోగించవచ్చని మేం విశ్వసిస్తున్నామని అధ్యయనంలో తెలిపారు. అయితే చైనా వస్తువులని నమ్మలేం.. మరీ చైనా టీకాని నమ్మొచ్చా ? అంటూ ఇతర దేశ ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.