తుంగభద్ర పుష్కరాలకు వెళ్తున్నారా.. ? అయితే ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిందే !
ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ వరకు తుంగభద్ర పుష్కరాలు కొనసాగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పుష్కరాలకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ పుష్కరాలకి హాజరయ్యేవారు ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నెగటివ్ రిపోర్ట్ వస్తేనే పుష్కరాలకి అనుమతి ఉంటుందని ప్రభుత్వ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.
* ఈ 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహణకు ఉంటుంది
* పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్లపైబడిన వారరు పుష్కరాలకు రావొద్దు
* కరోనా టెస్టు రిపోర్టులు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్కానింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు.
* పుష్కరఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి ఉంచనున్నారు
* మాస్కులు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
* కోవిడ్ నిబంధనలకు లోబడి పుష్కర స్నానాలకు అనుమతి