తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్మిషన్ల తేదిని ఈ నెల 30 వరకు పొడగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసింది. అయితే తాజాగా ఆ గడువుని 30 వరకు పొడగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇక డిసెంబర్ 1 నుంచి 9,10 తరగతులతో పాటు ఇంటర్ తరగతులని నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 2020-21 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ లేదా మే నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. వివిధ సెలవులను మినహాయించినా.. 120 రోజులు క్లాసులు జరిగేలా ప్రణాఌకలు తయారు చేస్తున్నారు.

ఇదిలావుండగా..  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలకు ఈ తేదీ పొడిగింపు నిర్ణయం వర్తించనుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,300 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పటివరకు 700 కళాశాలలకు మాత్రమే అఫిలియేషన్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించని 500 కళాశాలలకు అఫిలియేషన్లను నిలిపివేశారు. అయితే అఫిలియేషన్లు పొందని కాలేజీలకు సైతం మరో 15 రోజులు గడువు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.