బిగ్ బాస్ 4 ఫినాలే డేట్ ఫిక్స్ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 11 వారాలని పూర్తి చేసుకోబోతుంది. ఇక మిగిలింది నాలుగు వారాలు మాత్రమే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలేని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలెట్టినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 4 ఫినాలేకు డేటు కూడా ఫిక్సయిందని చెబుతున్నారు. డిసెంబర్ 20న ఫినాలే జరగనుందని తెలుస్తోంది.

ఈ బిగ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. గత సీజన్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన చేతుల మీదుగా బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కు ట్రోఫీ అందించారు. మరీ.. బిగ్ బాస్ 4 విజేత ఎవరి చేతుల మీదుగా టైటిల్ అందుకుంటారు ? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. బహుశా.. మహేష్, ప్రభాస్, ఎన్ టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరిని ఆహ్వానించే అవకాశం ఉందని చెబుతున్నారు.