అల్లు అర్హ కవర్ సాంగ్ వింటారా ?

స్టయిలీష్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ప్రేక్షకులని సప్రైజ్ చేయనుంది. ఆమె కవర్ సాంగ్ ని రేపు ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ ట్విట్ చేసింది. ‘అల.. వైకుంఠపురంలో’ ఓ మై డాడీ.. సాంగ్ లో బన్నీ పిల్లలిద్దరు అయాన్, అర్హ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అర్హ కవర్ సాంగ్ తో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. రష్మిక మందన హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం అయింది. ఇటీవలే పుష్ప షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు.