గ్రేటర్ పోరు నుంచి జనసేన అవుట్


జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బలమున్న 50 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 50 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. కానీ, నామినేషన్స్ దాఖలు చేసిన 24 గంటల్లోనే గ్రేటర్ పోటి నుంచి తప్పుకుంటున్నట్టు జనసేన ప్రకటించింది.

దీనికి కారణం భాజాపానే. నామినేషన్ల గడువు ముగుస్తున్న ఒకట్రెండు గంటల ముందు తెలంగాణ భాజాపా కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. గ్రేటర్ పోరులో భాజాపాకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారు. పోటీలో నిలిచిన 50 మంది జనసేన అభ్యర్థుల నామినేషన్లని విత్ డ్రా చేసుకుంటామని హామీ ఇచ్చారు. విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయనే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. భవిష్యత్ లోనూ తెలంగాణలోనూ భాజాపాతో ఈ రకమైన పోటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.