‘సర్కారు వారి పాట’ మొదలైంది. కానీ.. !


సినిమా వాళ్లకి సెంటిమెంట్లు ఎక్కువ. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం రెండు సెంటిమెంట్లని స్ట్రాంగ్ గా ఫాలో అవుతుంటారు. ఇందులో ఒకటి ఆయన సినిమాలకి మూడక్షరాల టైటిల్ ఉండేలా చూసుకుంటారు. ఈ సెంటిమెంట్ విషయంలో కాస్త కాంప్రైజ్ అవుతారేమో.. కానీ రెండో సెంటిమెంట్ ని మాత్రం ప్రిన్స్ బ్రేక్ చేయరు. ఇంతకీ ఏ రెండో సెంటిమెంట్ ఏంటో తెలుసా ?

మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరుకారు. మహేష్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మహేష్ హాజరుకాలేదు. కానీ మహేష్ భార్య సతీమణి నమ్రత, కూతురు సితార హాజరయ్యారు. న‌మ్ర‌త స్విచ్చాన్ చేస్తే.. మ‌హేష్ త‌న‌య సితార క్లాప్ కొట్టింది. జ‌న‌వ‌రి మొద‌టి వారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌.