పెళ్లి చేసుకోను.. కానీ బాయ్‌ఫ్రెండ్‌ను మెయింటైన్ చేస్తా !


తేజస్విని మడివాడ – మొదట్లో బుద్దిమంతురాలుగా కనిపించిన ఈ బ్యూటీ బోల్డ్ గా మారింది. దానికి కారణం ఎదురైన పరిస్థితులేనని చెబుతోంది. జీవితంలో నేను పెళ్లి చేసుకోను. గతంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. పెళ్లి చేసుకోను. కానీ బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తా. అది తప్పు అని నేను అనుకోను అని ఓపెన్ గా చెప్పేసింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘కమిట్ మెంట్’. ఇటీవలే ట్రైలర్ రిలీజైంది. ఇందులో బోల్డ్ పాత్రలో మెరిసింది తేజస్వి. దీంతో సినిమాపై, అందులో తేజస్విని పాత్రపై అంచనాలు పెరిగిపోయాయ్.

ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసింది తేజస్విని. పర్సనల్, సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇండస్ట్రీలో తనకు పడకగది పిలుపులు బాగానే వచ్చాయ్. నాకు తెలిసి ప్రతి ఒక్క నటికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. స్టార్ హీరోయిన్ల తమకు అలాంటి అనుభవం కలగలేదని చెబుతుంటారు. అది వారి అదృష్టం అని చెప్పుకొచ్చింది. ఇక కమిట్ మెంట్ సినిమా కోసం లిప్ కిస్ చేశా. నా ఇష్టంతో చేసిన తొలి కిస్ అది. ఆస్వాదించానని చెప్పుకొచ్చింది తేజస్విని.