కోలీవుడ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ అరెస్ట్

కోలీవుడ్ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ అరెస్టయ్యారు. అయితే ఇది పొలిటికల్ అరెస్ట్. ఉద‌య‌నిధి స్టాలిన్‌ డీఎంకే యూత్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో డీఎంకే త‌రుపున 75 రోజుల‌ క్యాంపెయిన్ ను తిరుకువ‌లైలో  ప్రారంభించారు. క్యాంపెయిన్ లో పాల్గొన్న ఉద‌య‌నిధి స్టాలిన్ ను తొలి రోజే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలని బ్రేక్ చేయడం కారణంగానే ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉద‌య‌నిధి స్టాలిన్ అరెస్ట్‌ను నేపథ్యంలో డీఎంకే శ్రేణులు ఆందోళనకి దిగాయి.ఎన్నిక‌ల నేప‌థ్యంలో 234 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో  15వేల కిలోమీట‌ర్ల మేర యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది డీఎంకే. 1500 స‌భ‌లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో యూత్ ని ఆకట్టుకోవడానికి ఉదయనిధి రంగంలోకి దిగారు. అరెస్టయిన ఉదయనిధి తిరిగొచ్చి.. పాదయాత్ర చేస్తారా ? అన్నది చూడాలి.