మోహన్ బాబుకు 45యేళ్లు.. స్పెషల్ ప్రోమో !

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆల్ రౌండర్. విలన్ గా మెప్పించారు. కామెడీ చేశారు. కారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోయారు. హీరోగా అగ్రస్థానానికి చేరుకున్నారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించారు. ఈ క్రమంలో నటుడిగా 45యేళ్లని పూర్తి చేసుకున్నారు. మోహన్ బాబు నటుడిగా ఎంట్రీ ఇచ్చి నేటితో 45యేళ్లు పూర్తయింది.

ఈ సందర్భంగా ఆయన పెద్ద కొడుకు, యంగ్ హీరో మంచు విష్ణు స్పెషల్ ప్రోమో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మై హీరో నటుడిగా 45యేళ్లు పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఇక ప్రోమోలో మోహన్ బాబు నటించిన ప్రతి సినిమాలోని బిట్ సీన్ ని చూపించినట్టున్నారు. మొత్తం 564 సినిమాల్లో నటించారు. 75 సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆఖరులో.. ‘నిన్న జరిగింది మరచిపోను. నేడు జగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను’ అంటూ డైలాగ్ కింగ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.