టీఆర్ఎస్’పై ఎంఎంఐ ఎటాక్
తెరాస, ఎంఐఎంలపై దోస్తానా పార్టీలు అనే ముద్రపడిపోయింది. మొదటి నుంచి తెరాసకు ఎంఐఎం మద్దుతుగా నిలుస్తూ వస్తుంది. అయితే తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు సొంతంగానే పోటీలోకి దిగాయి. ఎంఐఎం నేతని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని తెరాస చూస్తోందని భాజాపా నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఎంఐఎం, తెరాస అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎంఐఎంతో మాకు సంబంధం ఏంటీ ? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ పార్టీపై విమర్శలు మాత్రం చేయడం లేదు. ఎంఐఎం కూడా అంటే. కానీ మొదటి సారి ఎంఐఎం నేత అక్భరుద్దీన్ తెరాసపై ఎటాక్ చేశారు.
గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసన్నాడు. అంతేకాదు.. 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటున్నారు.. కానీ ఇంత వరకు అధికారులు ఆ చర్యలు చేపట్టనేలేదన్నారు. హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అక్భరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.