రాజధాని మార్పునకు పవన్ ఓకే చెప్పేసి వచ్చారా ?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ కి వెళ్లారు. గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్ ని ఢిల్లీకి ఆహ్వానించిన బీజేపీ అధిష్టానం ఆయనకి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేయించిందనే ప్రచారం జరిగింది. కాస్త ఆలస్యం చేసిన ఫైనల్ గా జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సమావేశం సాగిందని పవన్ తెలిపారు.
అమరావతి, పోలవరం, భాజాపా-జనసేన కూటమిని భవిష్యత్ లో ముందుకు తీసుకుపోయే అంశం, తిరుపతి ఉప ఎన్నిక, రాష్ట్రంలో దేవాలయాల ధ్వంసంపై చర్చించినట్టు పవన్ మీడియాకు తెలిపారు. అయితే అమరావతిపై పవన్ స్టాండ్ మారినట్టు ఆయన మాటల్లో అర్థమైంది. అమరావతిలో ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని కోరానని పవన్ అన్నారు.
అంటే.. రాజధాని మార్పు తధ్యం అన్నమాట. రైతుల డిమాండ్ లని పరిష్కరించి ఆ తర్వాత రాజధాని మార్పు చేసుకుంటే తనకు అభ్యంతరం లేదని పవన్ చెప్పినట్టు అర్థమవుతోంది. ఇక ఏపీలో 800 దేవాలయాలపై దాడులు జరిగాయి. వీటిపై చర్చించామని పవన్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిపై కూడా చర్చ జరిగిందన్నారు.