లేచిపోయిన అమ్మాయి విషయంలో ఢిల్లీ హైకోర్ట్ సంచలన తీర్పు
దేశంలో తరచూ పరువు హత్యలు వెలుగులోకి రావడం చూశాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్, హేమంత్ పరువు హత్యలకు బలయ్యారు. మేజర్ అయిన అమ్మాయి నచ్చినోడిని పెళ్లి చేసుకుంటే.. తల్లిదండ్రులకు నచ్చకపోవడం. తమ పరువుపోయిందని కూతురు చేసుకొన్న వాడిని హింసించడం.. అవసరమైతే చంపేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయ్.
తాజాగా మేజర్ అయిన అమ్మాయి తనకు నచ్చిన వాడితో ఎక్కడైనా ఉండొచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. 20 ఏళ్ల యువతి తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన ఓ కేసులో ఈ తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 12న సులేఖ అనే యువతి తన ప్రియుడు బబ్లూతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే తన చెల్లెలు కిడ్నాప్‌కి గురైందంటూ ఆమె అన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
తన చెల్లెలు బబ్లూ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని కూడా పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఢిల్లీ పోలీసుల ద్వారా సులేఖ జాడ కనిపెట్టిన ధర్మాసనం.. ఆ యువతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అయితే తన ఇష్ట ప్రకారమే బబ్లూను వివాహం చేసుకునేందుకు వెళ్లానంటూ సులేఖ కోర్టుకు వివరించింది. దీంతో సులేఖకు ఇష్టమైతే తాను కోరుకున్నవాడితోనే ఉండవచ్చునంటూ ధర్మాసనం స్పష్టం చేసింది
“బబ్లూతో కలిసి సులేఖ ఉండదల్చుకున్న ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ నంబర్‌ను సులేఖ, బబ్లూకి అందుబాటులో ఉంచాలి. వాళ్లకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోలీస్ అధికారులు అందుబాటులో ఉండాలి”లని కోర్ట్ తీర్పునిచ్చింది.