కులం, మతం తప్ప.. అభివృద్ది గురించి మాట్లాడరా ?

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో తెలంగాణ భాజాపాలో ఊపొచ్చింది. ఈ ఊపులోనే గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆశపడింది. కానీ గ్రేటర్ ఎన్నికల కోసం సన్నిద్దతకు ఆ పార్టీకి తగిన సమయం దొరకలేదు. దీంతో మేనిఫెస్టోని బలంగా రెడీ చేయలేదు. ప్రచారంలోనూ కొత్తదనం, కొత్త పంథా కనిపించడం లేదు. హిందు-ముస్లిం, కుల-మతాల మాటలు ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ది జపం చేస్తున్నారు.

గత ఆరేళ్లలో ఇవి చేశాం. ఇవి చేయబోతున్నామని చెబుతున్నారు. దమ్ముంటే.. ? హైదరాబాద్, తెలంగాణకు భాజాపా ఏం చేసింది ? ఏం చేయబోతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవిగాక హిందూ-ముస్లిం అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీటికి ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. నిజంగానే భాజాపాకు కులం, మతం తప్ప.. అభివృద్ది పట్టదా ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా తెలంగాణ భాజాపా నేతలు రూటు మార్చి.. కొంత పంథాల్లో ప్రచారం చేస్తే బాగుంటుందేమో.. !