ఆసీస్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ ?
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 13లో ఆసీస్ ఆటగాళ్లు మాక్స్ వెల్, స్మిత్, ఫించ్ తీవ్రంగా నిరాశపరిచారు. ఐపీఎల్ లో మాక్స్ వెల్ పంజాబ్ తరఫున ఆడాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.
మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్, బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ సైతం ఆ టీ20లీగ్‌లో ఆకట్టుకోలేకపోయారు. అయితే శుక్రవారం భారత్ తో జరిగిన తొలి వన్ డే లో మాత్రం ఈ ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఫించ్(114; 124 బంతుల్లో 9×4, 2×6), స్టీవ్‌స్మిత్(105; 66 బంతుల్లో 11×4, 4×6) శతకాలకు తోడు మాక్స్‌వెల్ (45; 19 బంతుల్లలో 5×4, 3×6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ చేసింది. 375 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 308 పరుగులకే పరిమితం అయింది.
ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ లో ఆసీస్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయ్. సోషల్ మీడియా వేదికగా పలువురు దీనిపై కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఐపీఎల్ 13 ముగిసి చాలా ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇంతలో ఆసీస్ ఆటగాళ్లు అద్భుత ఫామ్ ని అందుకోవడంపై అనుమానాలు కలుగుతున్నాయ్.