గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందట !
గ్రేటర్ ఎన్నికల వేళ తెరాస-భాజాపా తగ్గాపోరు పోట్లాడుతున్నయ్. ఎవ్వరూ తగ్గట్లే. మరోసారి గ్రేటర్ పీఠం మాదేనని గులాభి పార్టీ గర్జిస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో తెరాస తృతిలో సెంచరీ చేజార్చుకుంది. 99 సీట్లని గెలుచుకుంది. అయితే ఈ సారి సెంచరీ కొడతం అంటున్నారు. ఈ సారి కూడా మాకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయ్. ఈ సారి తమ పార్టీ మహిళా అభ్యర్థి మేయర్ అవుతారని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కేసీఆర్ పనైపోయింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూలిపోనుందని భాజాపా నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస ఎమ్మెల్యేలంతా భాజాపాలోకి క్యూ కడతరు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోనుంది అన్నారు.
బండి సంజయ్ చెప్పిన మాటలకు లాజిక్ లేకున్నా.. ఆయన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోనుందని చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయ్. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా విజయం సాధిస్తే.. తెరాస నేతలంతా భాజాపా వైపు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం కూలిపోతుందని భాజాపా నేతలు అంచనా వేస్తున్నారు. మరీ.. అది ఊహానా ? భ్రమనా ? లేక నిజం కానుందా ?? అన్నది గ్రేటర్ ఎన్నికలు తేల్చనున్నాయ్.