గ్రేటర్ పోలింగ్ : ఒక పార్టీకి గుర్తుకు బదులుగా మరో పార్టీ గుర్తు

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఇక ఆఖరి గంట అనగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా పాజిటివ్ ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కలిపించారు. ఇక గ్రేటర్ పోలింగ్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.

మలక్ పేటలో ఏకంగా పార్టీ గుర్తునే మారిపోయింది. ఓల్డ్ మలక్‌పేట్‌ 26వ వార్డులో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. సీపీఎం గుర్తును ముద్రించారు. సీపీఐ ఎన్నికల గుర్తుఅయినటువంటి కంకి కొడవలకి బదులుగా.. సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలని బ్యాలెట్‌లో ముద్రించారు. దీంతో సీపీఐ శ్రేణులు ఆందోళనకి దిగాయి. ఆ డివిజన్‌లో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.