ఎంఐఎంపై రిగ్గింగ్ ఫిర్యాదు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. అయినా.. ఆ హీటు ఇంకా ఇంకా చల్లాట్లేదు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భాజపా ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి ఈ ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
పాత బస్తీలోని ఘాన్సీబజార్‌లో పోలింగ్ స్టేషన్ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌లో పోలింగ్ స్టేషన్ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్ జరిగింది. వెంటనే మా పార్టీ అభ్యర్థి రిటర్నింగ్ ఆఫీసర్‌తో పాటు, ఎస్ఈఎసీకి ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ జరపాలని కోరారు. ఎన్నికల పరిశీలకుల ద్వారా విచారణ జరిపించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ చెప్పారని రామచంద్రరావు తెలిపారు.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదు అవ్వడంపై రాజకీయ పార్టీలు, ఎన్నిక సంఘం నిరాశలో ఉన్నాయ్. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు బయటికొచ్చి ఓటు వేసేలా ఆలోచనలు చేయాలని ప్రతి ఒక్కరు సూచిస్తున్నారు. ఓటు వేసిన వారికే హకులు లభించేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.