విశాఖలో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం !

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్‌ కత్తితో దాడి చేశాడు. విశాఖలోని ఫెర్రీ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రియాంక సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నారని తెలిసింది.

ప్రియాంకపై దాటి తర్వాత శ్రీకాంత్‌ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియాంకపై శ్రీకాంత్ దాడికి గల కారణాలు ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.