రియా సోదరుడికి బెయిల్ మంజూరు
బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టయ్యారు. ఇప్పటికే రియా బెయిల్ పై బయటికొచ్చారు. తాజాగా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి కూడా బెయిల్ మంజూరైంది.
షోవిక్ మొదట బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ బెయిల్ దొరకలేదు.దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ సమయంలో పోలీసుల ముందు చేసిన ప్రకటనలు కోర్టులో ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు తాజాగా పేర్కొంది. సుప్రీం తాజా తీర్పు ఆధారంగా ఎన్డీపీఎస్ కోర్టు ఆశ్రయించడంతో షోవిక్ కి బెయిల్ లభించింది.