గ్రేటర్ ఎన్నికల్లో బిగ్ బాస్ హిట్
గ్రేటర్ ప్రజలు బద్దకాన్ని వదల్లేదు. బయటికొచ్చి ఓటు వేయలేదు. ఫలితంగా గ్రేటర్ ఎన్నికల్లో 45.71 శాతానికి పరిమితమైంది. కొన్ని బూతుల్లో 20శాతం పోలింగ్ కూడా దాటలేదు. హైదరాబాదీల బద్దకంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయ్. ఈ నగరానికి ఏమైంది? బిగ్‌బాస్ షోలో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపే జనం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మొహం చాటేశారేంటి ? అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇదీ నిజమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కు కోట్ల కొలదీ ఓట్లు పడుతున్నాయని హోస్ట్ నాగార్జున గర్వంగా చెప్పుకుంటున్నారు. మంగళవారం ఉదయమే ఓటు వేసిన పలువురు సినీ ప్రముఖులు.. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బయటికొచ్చి ఓటు వేయాలని కోరారు. వారిపైనా నెటిజన్స్ సటైర్స్ వేశారు.
‘మేము అభిజిత్‌కు వేశాం, లేదు, లేదు.. అఖిల్‌కు వేశాం’, ‘మా వాడంటే మా వాడే గెలుస్తాడు, మీరు కూడా ఈ కంటెస్టెంట్‌కే సపోర్ట్ చేయండి, ఇతడికే ఓట్లు వేయండి..’ అంటూ వాళ్లకే తిరిగి సలహాలు ఇచ్చారు. ఈ షాకులతో అవాక్కయిన సెలబ్రిటీలు నవ్వాలో, ఏడవాలో తెలీని అయోమయంలో పడ్డారు. మొత్తానికి గ్రేటర్ పోరులోనూ బిగ్ బాస్ హిట్ అయినట్టున్నాడు. గ్రేటర్ ఓటర్లు బిగ్ బాస్ కు ఓట్లు వేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ రాజకీయ నేతలకి ఓట్లు వేయడానికి మాత్రమే ఆసక్తి చూపడం లేదు.