హవ్వా.. చంద్రన్న భజనకు రూ.80కోట్లు !

ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు కాస్ట్లీ భజనని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాడు. ఆ భజనని చూసి సభ్యులంతా పగలబడి నవ్వుకున్నారు. తెదేపా హయాంలో పోలవరం సందర్శన కోసం రాజకీయ నాయకులు, ప్రజలని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ. 80.45కోట్ల ఖర్చు చేశారట.

ఈ విషయాన్ని సీఎం జగన్ బుధవారం అసెంబ్లీలో బయటపెట్టారు. ప్రజలని అక్కడికి తీసుకెళ్లి చంద్రబాబు ఏం చేశారో కూడా ఓ వీడియోని ప్రదర్శించి చూపించారు. ఇందులో మహిళలలు చంద్రబాబు జపం చేయడం చూడొచ్చు. ఇలా తనవాళ్లని తీసుకెళ్లి.. అక్కడ భజన చేయించుకున్నారు బాబు. ఈ భజన కోసం ఏకంగా రూ. 8.45కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అదే మన ప్రభుత్వం ఒక్క పైసా కూడా వృధా ఖర్చు చేయలేదని తెలిపారు.