ప్రభాస్’తో మరో సినిమా చేస్తా : రాజమౌళి

ప్రభాస్-రాజమౌళి కలయికలో వచ్చిన ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. బాహుబలితో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలని చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్-రాజమౌళి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని అబిమానులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కలిసి మరోసారి పనిచేయడంపై తాజాగా రాజమౌళి స్పందించారు. “బాహుబలి’ కోసం ఐదేళ్లు కలిసి పనిచేయడం వల్ల మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. అయితే, మా ఇద్దరిలో ఆసక్తి రేకెత్తించే కథ సిద్ధమైతే.. తప్పకుండా మేమిద్దరం మరోసారి కలిసి పని చేస్తాం” అని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.