2020లో వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా బాదని కోహ్లీ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2020 తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈ యేడాది వన్డేల్లో విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన విరాట్‌ కోహ్లీ 2008లో నేరుగా టీమ్‌ఇండియాలోకి ప్రవేశించాడు. దంబుల్లాలో శ్రీలంకపై అరంగేట్రం చేసి 12 పరుగులు సాధించాడు. ఆ ఏడాది ఐదు మ్యాచులు ఆడినప్పటికీ శతకాలేమీ సాధించలేదు. ఒక అర్ధశతకంతో ఆ ఏడాదిని ముగించాడు.

ఆ తర్వాత నుంచి అతడి బ్యాటు నుంచి శతకాలు జాలువారాయి. 2009లో 1, 2010లో 3, 2011లో 4, 2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తంగా 43 శతకాలు బాదేశాడు. 2020లో మాత్రం 9 మ్యాచులాడినా విరాట్‌ ఒక్క శతకమూ చేయలేదు. అయితే 5 అర్ధశతకాలు చేయడం విశేషం. అందులో రెండుసార్లు 89 స్కోర్లు సాధించాడు.