రౌడీ.. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి : బన్నీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ అంటే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇష్టం. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు చెప్పారాయన. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని.. ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి పంపించారు కూడా.
తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి ‘పుష్ప’ హీరో కోసం దుస్తులు డిజైన్ చేసి పంపించారు. విజయ్ పంపిన దుస్తులు తనకి నచ్చాయని బన్నీ పేర్కొన్నారు. ఈ మేరకు బన్నీ ట్విట్ చేశారు. ‘ఇలాంటి అందమైన, సౌకర్యవంతమైన దుస్తులు పంపించిన నా బ్రదర్ విజయ్ దేవరకొండ, రౌడీ క్లబ్ టీమ్‌కు ధన్యవాదాలు. నాపై నువ్వు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు బ్రదర్. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.