బిగ్ బాస్ టైమింగ్స్ మారాయ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆఖరి వారాల్లో బిగ్ బాస్ టైమింగ్స్ మారనున్నాయ్. ఇప్పటి వరకు సోమ-శుక్ర వరకు రాత్రి 9:30-10:30 నిమిషాల వరకు శని-ఆదివారాల్లో మాత్రం రాత్రి 9-10గంటల వరకు బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేది. అయితే ఈ నెల 7 నుంచి బిగ్ బాస్ టైమింగ్స్ మారనున్నాయ్. సోమ-శుక్ర వారాల్లో బిగ్ బాస్ రాత్రి 10-11గంటలకు ప్రసారం కానుంది. శని, ఆదివారాల్లో మాత్రం మార్పు లేదు.

డిసెంబర్ 7 నుంచి స్టార్ మాలో కొత్త సీరియల్ ‘గుప్పెడంత మనసు’ ప్రసారం కానుంది. రాత్రి 7-7:30 వరకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఇప్పటి వరకు ఆ సమయంలో వదినమ్మ సీరియల్ వచ్చేసింది. ఇప్పుడీ ఈ సీరియల్ ని బిగ్ బాస్ టైమ్ రాత్రి 9:30కి తీసుకొచ్చారు. టైమింగ్ మార్పు వలన బిగ్ బాస్ కిఏమైన డ్యామేజ్ అవుతుందా అంటే.. ? అలాంటిదేమీ ఉండదు. ఒకట్రెండు వారాల్లో ముగిసే బిగ్ బాస్ పై ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు అని చెబుతున్నారు.