‘కేజీఎఫ్2’ టీజర్ రిలీజ్ డేటు ఫిక్స్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌-1’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడీ ఈ సినిమా సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ చిత్రంలో ‘అధీరా’ అనే కీలక పాత్రలో కనిపించారు. అలాగే నటి రవీనాటాండన్‌ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రావురమేష్‌, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేటుని ఖరారు చేశారు. ” ‘కేజీఎఫ్‌’ విడుదలై(డిసెంబర్‌ 21, 2018) మూడేళ్లు అవుతుంది. బాస్‌ సినిమా ‘కేజీఎఫ్‌ 2′ టీజరైనా విడుదల చేయండి’ అంటూ ఓ నెటిజన్‌ నిర్మాత కార్తిక్‌గౌడకు ట్వీట్‌ చేశాడు. సదరు ట్వీట్‌కు స్పందించిన కార్తిక్‌.. ‘యశ్‌ పుట్టిన రోజుకు (జనవరి 8) టీజర్‌ విడుదల చేస్తాం. టీజర్‌ వేరే లెవల్‌లో ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు.