కోహ్లీలా మరెవరూ ఆడలేరు
ఆకలిగొన్న పులిలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్త రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో 63 పరుగుల చేసిన కోహ్లీ అతివేగంగా 12వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. 251 మ్యాచ్ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకొని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలోనే 43 శతకాలు, 60 అర్ధశతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై ప్రశంసలు వర్షం కురుస్తోంది.
కోహ్లీలా మరెవరూ ఆడలేరని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసించారు. 251 మ్యాచ్ల్లో 43 శతకాలు, 60 అర్ధ శతకాలు బాదాడంటే 100 సార్లకు పైగా మనం అతడి గురించి మాట్లాడుకున్నాం. అదంత సులువు కాదు. ఇలా ఎవరూ ఆడలేదు. అర్ధశతకాలను అతడు శతకాలుగా మలచడం నమ్మశక్యం కానిది. మనం ఈ విషయాన్ని ఆస్వాదించాలన్నారు.