‘ఫిదా’ అంతకుమించిన ‘తొలిప్రేమ’ !

మెగా హీరోలకు భిన్నంగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే ‘కంచె’తో ఆకట్టుకొన్నాడు. ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆయన తాజా చిత్రం ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ టాక్’తో థియేటర్స్ లో సందడి చేస్తోంది.

‘ఫిదా’ వరుణ్ తేజ్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు ‘ఫిదా’ అంతకుమించిన హిట్ ని ‘తొలిప్రేమ’ అందజేసేలా ఉంది. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్స్ లో తొలిప్రేమ ఫిదాని మించిపోయింది. ఫిదా తొలిరోజు రూ. 8.45కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు తొలిప్రేమ రూ. 9.5కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన మెగా ప్రిన్స్ ఖాతాలో రెండో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టేనని చెప్పుకొంటున్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏపీసోడ్, దానికి తగ్గ నేపథ్యం, ఫర్ ఫెక్ట్ గా సూటయ్యే మాటలు ఆకట్టుకొన్నాయి. ప్రేమజంటగా వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లింది. ఫలితంగా ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ తేలిందని చెప్పవచ్చు.