గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాలు : టాప్ గేర్ లో టీఆర్ఎస్

గ్రేటర్ లో తొలి రౌండ్ ఫలితాలొచ్చాయ్. కారు టాప్ గేర్ లో దూసుకెళ్తోంది.  తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. జూబ్లీ హీల్స్, పటాన్ చెరువు, హైదరనగర్, కాప్రా, చర్లపల్లి, మీర్ పేట్, బీఎన్ నగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్,  రామ్ చంద్రానగర్, శేర్ లింగం పల్లి, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలానగర్, చందానగర్, అసిఫ్ పేట్ లలో తెరాస ముందంజలో ఉంది. ఇక భారతీనగర్, కొండాపూర్ లలో భాజాపా ఆధిక్యంలో ఉంది.

అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా టీఆర్ఎస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం 80 స్థానాల్లో భాజాపా అధిక్యంలో నిలిచింది. తెరాస 35 స్థానాల్లో ఆధిక్యం చూపించింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ లో రిపీట్ కానుందా ? గ్రేటర్ లోనూ తెరాసకు షాక్ తప్పదా ?? అనే సందేహాలు నెలకొన్నాయ్. అయితే  తొలి రౌండ్ ఫలితాలు రాకతో.. హైదరాబాద్ తెరాస అడ్డాని క్లారిటీ వచ్చేసింది. తెరాస నేతలు ముందు  నుంచి చెబుతున్నట్టుగా సెంచరీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదేమో.. !