12 మంది ఆటగాళ్లతో ఆడిన టీమిండియా.. ఎలాగో తెలుసా ?

టీ20 సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20లో ఆసీస్ ని 11 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా 12 మంది ఆటగాళ్లని ఆడించింది. అది ఎలా సాధ్యమవుతోంది ? అంటే.. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్ ని టీమిండియా వాడుకుంది.

రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ చివరి గాయపడ్డాడు. అతడి హెల్మెట్‌కు బంతి తాకడంతో ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. అయితే టీమిండియా బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత అతని స్థానంలో చహల్‌ను కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా టీమిండియా తీసుకుంది. దీనిపై ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చహర్ 3 వికెట్లు తీసుకొని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బ్యాటింగ్ లో రవీంద్ర జడేజా 44 (23బంతుల్లో) అదరగొట్టేశాడు. తొలిసారి టీమిండియా ఓ మ్యాచ్ లో 12 మంది ఆటగాళ్లని వాడుకోవడం బహుశా.. ఇదే తొలిసారి.