ఆర్బీఐ మరో కీలక నిర్ణయం
ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితిని 2 వేల నుండి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని శక్తికాంతదాస్ సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తోన్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్నారు.వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను ఒకింత సానుకూలంగా సవరించింది.