రైతులకు మద్దతుగా పవన్ దీక్ష

రైతులకి మద్దతుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దీక్ష చేసే ఆలోచనలో ఉన్నారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జనసేనాని గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. రైతులని పరామర్శిస్తున్నారు. రైతులకు భరోసా, మనోధైర్యం ఇవ్వడం కోసం వచ్చినట్లు పవన్ తెలిపారు. రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని పవన్ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు పవన్ మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా పవన్ పోరాటం చేస్తే బాగుంటుంది వైసీపీ శ్రేణులు అంటున్నాయి.