కవితకు కమలం.. ముచ్చటగా మూడు షాకులు !

సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు కమలం గుండం ఉన్నట్టుంది. ఇప్పటికే కవితకు భాజాపా రెండు షాకులిచ్చింది. మూడో షాక్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో తెరాస ‘కారు సారు పదహారు’ స్లోగన్ తో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కారు స్పీడు 16కు చేరుకోలేదు. 9 సీట్లకే పరిమితం అయింది. తెరాసకు సీట్లు తగ్గాయన్న బాధకంటే నిజామాబాద్ లో కవిత ఓడిపోయారన్న బాధనే ఎక్కువైంది. కవితపై భాజాపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఓడిన బాధలో ఉన్న కవిత కొన్నాళ్లు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఆమె బాధని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో కూతురిని ఎమ్మెల్సీ చేశారు. త్వరలోనే మంత్రి పదవి కూడా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ గ్రేటర్ ఫలితాలతో కవితని మంత్రి చేయడం దాదాపు అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఎందుకంటే? కవితకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సమయంలోనే సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలొచ్చాయ్. కూతురుకి తొమ్మిది నెలల పాటు పదవి  లేకుంటే తట్టుకోలేకపోయింది. తెలంగాణలోని నిరుద్యోగులు ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం లేదు. ఉన్న ఉద్యోగులని బాగా చూసుకోవడం లేదనే విమర్శలొచ్చాయ్. ఇక గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కవిత ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన గాంధీ నగర్ తెరాస అభ్యర్థి ఓటమిపాలయ్యారు. దీంతో కవితకు కమలం షాకుల మీద షాకులిస్తుందని చెప్పుకొంటున్నారు. గ్రేటర్ లో కమలం ఇచ్చిన షాక్ కు కవితకు మంత్రి పదవి కూడా రాదని చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. ఇప్పటి వరకు కవితకు కమలం పార్టీ ముచ్చటగా మూడు షాకులిచ్చింది. భవిష్యత్ లో ఇంకెన్ని షాకులిస్తుందో చూడాలి.