గ్రేటర్ ఫలితాలపై పవన్ కామెంట్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస లెక్క తప్పింది. ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. 100 టార్గెట్ గా పెట్టుకుంటే 55 మాత్రమే వచ్చాయి. గ్రేటర్ భాజాపా అనూహ్యంగా పుంజుకుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే గెలిచిన భాజాపా.. ఈ సారి ఏకంగా 49 స్థానాలని గెలుచుకుంది. వాస్తవానికి గ్రేటర్ ప్రచారం కోసం భాజాపాకు చాలా తక్కువ సమయం ఉంది. ఆ టైమ్ లోనే భాజాపా వ్యూహాలని పక్కగా అమలు చేయగలిగింది. మొదటగా జనసేన మద్దతుని కూడగట్టింది. దీంతో.. పవన్ అభిమానులు, యూత్ ఓటు బ్యాంక్ ని మిస్ కాకుండా చేయగలిగింది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ లో భాజాపా బలం పెరిగిన విషయంలో జనసేనకు క్రికెట్ ఇవ్వాల్సిందే. ఇక గ్రేటర్ ఫలితాలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమైందని పవన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు బలమైన సంకేతం పంపేలా చేసినట్లయిందన్నారు.