తెలంగాణ కాంగ్రెస్’కు బిగ్ షాక్.. బీజేపీలో జానారెడ్డి !
గ్రేటర్ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో పలు విషయాలపై క్లారిటీ ఇచ్చినట్టయింది. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపా అనే విషయంలో ఫుల్ కారిటీ వచ్చేసింది. అంతేకాదు.. తెరాసలో చేరలేని నేతలకి బీజేపీలో చేరేందుకు ధైర్యం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెదేపా, తెరాస నుంచి కూడా నేతలు భాజాపాలోకి క్యూ కట్టబోతున్నారని అర్థమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలబోతుంది. ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అతి త్వరలోనే భాజాపాలో చేరబోతున్నారని సమాచారమ్.
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అది జానారెడ్డి సొంత నియోజకవర్గం.2009, 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించిన జానారెడ్డి.. 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జానారెడ్డి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగి గెలవలేరు. అందుకే ఆయన భాజాపా వైపు చూస్తున్నారు. ఆ పార్టీ నేతలతో చర్చలు మొదలెట్టారని సమాచారమ్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.