సాగరకన్య కొత్త రెస్టారెంట్ చూశారా ?


సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది శిల్పాశెట్టి. ఆమె వ్యాపారవేత్తగా ముందంజలో ఉన్నారు. 2019లో బాస్టియన్‌ ఆతిథ్యసేవాసంస్థలో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బాస్టియన్‌ పేరుతో రెస్టారంట్‌లు నడుపుతున్నారు. తాజాగా వర్లీలో మరో శాఖను ఆరంభించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ శిల్పా ఫొటోలు షేర్‌ చేశారు. వాటిలో చూస్తే.. శిల్పా రెస్తారెంట్ అదిరిపోయేలా ఉంది.

మరోవైపు శిల్పాశెట్టి సొంతంగా ఫిట్‌నెస్‌ యాప్‌ను నడుపుతున్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ మమాఎర్త్‌లోనూ ఆమె భాగస్వామ్యం ఉంది. దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. దాని విలువ దాదాపు రూ.50 కోట్లని సమాచారం. ముంబయిలో వీరు నివాసం ఉంటున్న భవంతి కూడా అత్యంత ఖరీదైనదే. మరోపక్క ఆమె ‘సూపర్‌ డ్యాన్సర్‌ చాప్టర్‌ 3’కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.