ఈ నెల 17నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.
తెలంగాణలో అత్యద్భుత పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి.. ప్రతీ ఏటా ఎంతో వైభవంగా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవ కైంకర్యాలుర, అలంకార సేవలు గత ఏడాదిలాగే ఈ సారి కూడా బాలాలయానికే పరిమితం కానున్నాయి.
ఈ నెల 17 నుంచి 27వరకు 11రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవాలను భక్తుల దర్శనార్థం కొండ కింద నిర్వహించనున్నారు.
ఈ నెల 17న స్వస్తివాచనం, 18న ధ్వజారోహణం, 19నుంచి 22వరకు స్వామి వారికి అలంకార సేవలు నిర్వహిస్తారు. 23న ఎదుర్కోలు ఉత్సవం, 24న కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున కళ్యాణోత్సవం రోజున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సాయంత్రం కొండ కింద జరిగే కళ్యాణోత్సవానికి గవర్నర్ దంపతులు హజరవుతారు. 27వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
బ్రహ్మోత్సవాల షెడ్యూలు ఇలా ఉంది.