@2023 గంట మ్రోగించిన తెలంగాణ భాజాపా
తెలంగాణ భాజాపాకు మంచిరోజులొచ్చాయ్. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపానే అన్నది ఖరారైంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ భాజాపా @2023 గంటని మ్రోగించింది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే.. అంటే ఈరోజు మీడియా సమావేశం నిర్వహించింది తెలంగాణ భాజాపా. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. భాజాపాను కేసీఆర్ కానీ, ఒవైసీ కానీ అడ్డుకోలేరు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మరోవైపు బండి సంజయ్ కు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. అక్కడ ఆయన్ని అభినందించడంతో పాటు.. తదుపరి బాధ్యతని గుర్తు చేయనున్నారని తెలుస్తోంది.