నేను ధోనిని కాదు.. !

మూడు టీ20ల సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ధావన్‌(52), రాహుల్‌(30)ల ఆరంభానికి మిడిల్‌ ఆర్డర్‌లో కోహ్లి(40) మెరుపులు కూడా తోడయ్యాయి.  చివర్లో హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా ఎటువంటి ఒత్తిడి లేకుండానే విజయం సొంతం చేసుకుంది. కాగా,  ధావన్‌ను స్టంపింగ్‌ చేయడానికి యత్నించిన మథ్యూ వేడ్‌ విఫలమయ్యాడు.

ఆ టైమ్ లో  ‘నేను ధోనిని కాదు.. ధోని తరహాలో వేగంగా స్టంపింగ్‌ చేయడానికి’ అని జోక్స్‌ పేల్చాడు. ఇది బాగా వైరల్‌ అయ్యింది.  ప్రపంచ క్రికెట్‌లో ధోని ఒక అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకంగా స్టంపింగ్‌లో ధోని చాలా క్విక్‌గా రియాక్ట్‌ అవుతాడు. దీన్నిఉద్దేశించే వేడ్‌ మాట్లాడాడు.