మెగా అప్పగింతలు అయిపోయాయ్ !
మెగా డాటర్ నిహారిక పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో తో నిహారిక వివాహం రేపు (డిసెంబర్ 9)న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్ లో జరగనుంది. అయితే పెళ్లికి ముందే అల్లుడి చేతిలో కూతురిని పెట్టి.. మెగా ఫాదర్స్ ఎమోషనల్ ట్విట్ చేశారు. ఇప్పటికే కూతురు పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you!’ అని ట్విట్ చేశారు. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ చేరుకుంది. సోమవారం రాత్రి జరిగిన సంగీత్ ఫంక్షన్ లో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020