మెగా ఆహ్వానం.. కుళ్లుకుంటున్న మెగా హీరోయిన్స్ !
మెగా డాటర్ నిహారిక పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్నాయ్. ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య జొన్నలగడ్డ మూడుముళ్లు వేయనున్నారు. కరోనా నేపథ్యంలో నిహారిక వివాహ వేడుకకి అతికొద్దిమంది అతిథులని మాత్రమే ఆహ్వానించారు.
మెగా ఫ్యామిలీ, కొందరు బంధువులు మాత్రమే ఉదయ్ పూర్ కి విచ్చేశారు. ఈ లిస్టులో టాలీవుడ్ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ ఉన్నారు. హీరోయిన్స్ లిస్టులో వీరిద్దరికి మాత్రమే మెగా ఆహ్వానం అందిందట. వీరిద్దరు నిహారికకు చాలా క్లోజ్. వీరిద్దరికి మాత్రమే మెగా ఆహ్వానం అందడంపై మెగా హీరోయిన్స్ కుళ్లుకుంటున్నారట.
వాస్తవానికి టాలీవుడ్ లో మెగా హీరోయిన్స్ లిస్టు పెద్దదే. ఒకసారి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ వరుసగా మెగా హీరోలతో రొమాన్స్ చేస్తుంటుంది. త్రిష, కాజల్, రకుల్.. ఇలా చాలామంది ఉన్నారు. అయితే వీరికి మెగా ఆహ్వానం అందలేదు. అందుకే.. రీతూ, లావణ్యలని చూసి.. వీరు కుళ్లుకుంటున్నారని సమాచారమ్.
#NiharikaKonidela's BFFs @Itslavanya & @riturv enjoy some good music, dance & company at the #NisChay mehendi ✨💖#LavanyaTripathi #RituVarma #Tollywood #TollywoodActress #Niharika #ChaitanyaJV #ChaitanyaJonnalagadda #MrsNiha #MegaFamily pic.twitter.com/43IaHmlBm8
— BHARAT (@AbdulsameerD) December 8, 2020