టీజర్’తో హీటెక్కిస్తున్న షకీలా

శృంగార తార షకీలా సినిమా వస్తుందంటే సూపర్ స్టార్ సినిమాలే సైడ్ అయిపోయాయ్. అంతటి క్రేజ్ కలిగిన షకీలా జీవితకథ ఆధారంగా ‘షకీలా’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. షకీలా పాత్రని బాలీవుడ్ బ్యూటీ రిచాచద్దా పోషిస్తోంది. ఇంద్రిజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా షకీలా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు.

షకీలా నుంచి అభిమానులు కోరుకొనే అన్నీ బిట్ సీన్స్ ని టీజర్ లో ఉంచారు. సినిమా హాళ్లకు జ‌నాలు రాని స‌మ‌యంలో ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ప‌లికే ఒకే ఒక పేరు అంటూ షురూ.. టీజర్ మొదలైంది.. ఆ తర్వాత  హాట్, రొమాంటిక్ సీన్స్ తో నింపేశారు. షకీలా పాత్రలో రిచాచద్దా క్లిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసింది. టీజర్ తోనే హీటెక్కించే ప్రయత్నం చేసింది.