వైరల్ : నిహారిక పెళ్లి ఫోటోలు
మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ తో పాటు పరిమిత సంఖ్యలో హాజరైన ప్రముఖులు కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.
మూడు రోజులగా ఉదయ్ పూర్ లో ముందస్తు పెళ్లి వేడుకలు జరిగాయి. బుధవారం రాత్రికొత్త జంట మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటైంది. పెళ్లి సందర్భంగా నాగబాబు ఎమోషనల్ ట్విట్ చేశారు. ‘నా కుమార్తె పాఠశాలకు వెళ్లిన తొలిరోజుగా అనిపిస్తుంది. ఇక ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. ఇక నా చిన్నారి ఎదిగి, పాఠశాలకు వెళ్లినప్పుడు ఇకపై ఆమెతో రోజంతా ఆడుకోలేనని నా మనసుకు కొన్నేళ్లు పట్టింది. ఈ సారి ఎంతకాలం పడుతుందో కాలమే నిర్ణయిస్తుంది’ అని రాసుకొచ్చారు.