అభిజిత్’కు స్టార్స్ సపోర్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగింపునకు చేరుకుంటోంది. ఈ వారంతో పదమూడు వారాలు పూర్తికానున్నాయ్. ఇక మిగిలింది రెండు వారాలే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 విన్నర్ గా ఎవరు నిలుస్తారు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ రేసులో అభిజిత్ మొదటి నుంచి ముందున్నారు. అభిజిత్ కు ప్రేక్షకులు మాత్రమే కాదు స్టార్స్ సపోర్ట్ కూడా ఉంది. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. అభిజిత్ కే ఓటేసిన సంగతి తెలిసిందే.

పలువురు హీరోలు కూడా బిగ్ బాస్ 4 విజేతగా అభిజిత్ నిలుస్తారని చెబుతున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ అని చెప్పేశాడు. ఇప్పుడున్న ప‌రిస్థితుల ప్ర‌కారమైతే అభిజిత్ విన్న‌ర్ అవుతాడ‌ని అనిపిస్తోందన్నారు. ఇక ఇప్ప‌టికే నాగ‌బాబు అభిజిత్‌కు స‌పోర్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు కొంద‌రు జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టులు కూడా అభిజిత్ కే  తమ ఓట‌ని తేల్చి చెప్పారు. వాస్తవానికి అభిజిత్ టాస్కులు పెద్దగా ఆడడు. ఫిజికల్ గా వీక్ కానీ.. మెంటల్ గా చాలా స్ట్రాంగ్. అదే ఆయన్ని బిగ్ బాస్ విన్నర్ ని చేయనుందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.