‘పిల్ల జ‌మిందార్‌’ కాంబో రిపీట్

‘పిల్ల జమిందార్’గా కనిపించి మెప్పించారు నాని. ఈ సినిమా ద్వారా అశోక్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ‘భాగమతి’ సినిమాతో అశోక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. భాగమతిని బాలీవుడ్ కి తీసుకెళ్లారు. `భాగ‌మ‌తి` దుర్గామ‌తిగా రీమేక్ అయ్యింది. ఈనెల 11న అమేజాన్‌లో విడుద‌ల కానుంది. 

ఈలోగా.. ఓ తెలుగు సినిమాని ఓకే చేయించుకున్నారు అశోక్. ఓ సున్నిత‌మైన పాయింట్ ని వినోద భ‌రితంగా చెప్ప‌బోతున్నాం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా తీసుకొస్తామని అశోక్ ప్రకటించారు. ఆ సినిమా నానితోనే అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని టక్ జగదీష్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ చేయాల్సివుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అశోక్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.