రైతుల ఆందోళన వెనక చైనా, పాక్’ల కుట్ర
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త చట్టాల రద్దుని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న చేసిన భారత్ బంద్ విజయవంతం అయింది. మరోవైపు రైతులతో కేంద్రం పలు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించడం లేదు. చట్టంలో మార్పులు చేస్తామని కేంద్రం చెప్పిన రైతులు వినడం లేదు. ఆ చట్టాలని మొత్తానిక్కి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల వెనుక చైనా, పాక్ కుట్ర ఉన్నట్లు ఆరోపించారు. గతంలో సీఏఏ, ఎన్ఆర్సీ అంశంలో చైనా, పాక్ దేశాలు కుట్రలు చేయాలని ప్రయత్నించాయి. కానీ విఫలం అయ్యారు. ఇప్పుడు రైతుల వెనక ఆ రెండు దేశాలు ఉండి.. ఆందోళన చేయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే మనదేశ రైతులకు చైనా, పాక్ లతో సంబంధాలున్నాయి అన్నట్టుగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఉండటం వివాదాలకు దారితీస్తోంది.