పులిరాజాకు కరోనా వస్తుందా ?

పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా ? ఎయిడ్స్ ప్రచారంలో బాగా ప్రచారంలోకి వచ్చిన ప్రశ్న ఇది. ఇక్కడ పులిరాజా అన్న ఊహాజనితమైన వ్యక్తి. చాలా ధైర్యవంతుడనీ, వేశ్యాలంపటుడనీ, ఐతే పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అంటూ ప్రశ్నించి ఎంత ధైర్యవంతుడైనా ఎయిడ్స్ రావచ్చని చెప్పారు. ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే.. ? పులిరాజా అయినా నిరోద్ లని వాడాలని ప్రచారం చేశారు. అది ఫలించింది కూడా.

ఇప్పుడు మహమ్మారి కరోనా పులిరాజాకు వస్తుందా ? అంటే  కచ్చితంగా వస్తుంది. పులిరాజాలకే కాదు. పులులకి కరోనా సోకుతుంది. బార్సిలోనా జంతు ప్రదర్శనశాలలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు జూ అధికారులు తెలిపారు. జూపార్క్‌లోకి నిత్యం సందర్శకులు వస్తుండడంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పశు వైద్యాధికారులు తెలిపారు. జాలా, నిమా, రన్ రన్‌, కింబే అనే సింహాల్లో స్వల్ప లక్షణాలున్నట్లు కీపర్లు గుర్తించారు.